“అమృత వర్షిణి” కథ పరిచయం/నేపధ్యం

మూల కథని “శరీరం” అనే పేరుతో మలయాళంలో ఎం.కె.చాంద్ రాజ్ రాసారు. ఈ కథని ఆకాశవాణి తిరువనంతపురం కేంద్రం ప్రసారం చేసింది. ఈ కథని ఆంగ్లంలోకి సుధీర్ అనువదించారు. నా తెలుగు అనువాదాన్ని ఆంధ్ర జ్యోతి దినపతిక 13 జూలై 2008 నాటి ఆదివారం అనుబంధంలో ప్రచురించింది.

కేరళ లోని కసర్‌గోడ్ జిల్లా లో ప్రకృతి విషపూరితం అవడంవల్ల, శాస్రీయ సంగీతం నేర్చుకుని, కళాకారిణిగా ఎదగాలనుకున్న ఓ  యువతి జీవితం ఏ విధంగా బలయ్యిందో ఈ కథ తెలియజేస్తుంది. వాస్తవాలకి నాటకీయత జోడించిన కథ ఇది. కథలో ప్రస్తావించిన డాక్యుమెంటరీ నిజంగా ఉన్నదే.

60 నిముషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ ని 2004లో గ్రీన్ ఫోక్స్ అనే కంపెనీ నిర్మించింది. మలయాళంలో దీని పేరు   “Arajeevinthangalko ru swargam” ( A paradise for the dying) ఎం ఎ రెహమాన్ దీనికి దర్శకుడు. K M K Kunhabdulla నిర్మాత. కేరళ లోని కసర్‌గోడ్ జిల్లాలో జీడిమామిడి తోటలలో  ఎండోసల్ఫాన్ విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల జరిగిన దుష్ఫలితాలను అద్భుతంగా ప్రదర్సిస్తుందీ డాక్యుమెంటరీ. దానిపై రేగిన రాజకీయాలను సైతం వ్యంగ్యంగా, నూతన రీతిలో చెప్పిందా డాక్యుమెంటరీ.

అసలు కథని రేపు చదవండి.

1 comment జులై 14, 2008

Next Posts Previous Posts


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు