నా గురించి

నమస్తే!

నా పేరు కొల్లూరి సోమ శంకర్.  నా వయసు 34 సంవత్సరాలు. చదువు బి.ఎ.  HRD లో PG Diploma చేసాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యాను.ఓ స్వచ్చంద సంస్థ లో ఉద్యోగం.  ప్ర స్తుత నివాసం హైదరాబాదు. మాకు ఓ రెండేళ్ళ పాప ఉంది.

రచనా వ్యాసాంగం:

నేనో amateur కథకుడిని,అనువాదకుడిని. గతంలో కొన్ని దిన పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహించాను. వ్యాసాలు రాసాను. నా సొంత కథలు, అనువాదాలు వివిధ తెలుగు పత్రికలలోనూ, వివిధ వెబ్‌జైన్లలోనూ ప్రచురితమయ్యాయి.

ఫిక్షన్:

2001 నుంచి కథలు రాస్తున్నాను. 2002 నుంచి హిందీ, ఇంగ్లీష్ నుంచి తెలుగు లో కి కథలను అనువదిస్తున్నాను. ఇప్పటి దాక 30 సొంత కథలు రాసాను, 57 కథలను అనువదించాను. 53 ప్రచురితం. మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగు లో కి అనువదించడానికి ప్రయత్నిస్తుంటాను.

ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలో కి అనువదిస్తున్నాను. ప్రస్తుతానికి 4 కథలని అనువదించాను. 3 కథలు ప్రచురితమయ్యాయి. నాల్గవది (ప్రముఖ కథా రచయిత శ్రీ కె.వి.నరేందర్ రాసిన “చీపురు” అనే తెలుగు కథ కి అనువాదం), పరిశీలనలో ఉంది. 

2006 లో మనీ ప్లాంట్  అనే అనువాద కథా సంకలనం వెలువరించాను. మూల కధలను హిందీ, ఇంగ్లీష్,తమిళం, కాశ్మీరి, బంగ్లా  భాషలనుంచి తీసుకున్నాను. పుస్తకానికి ముందు మాటను శ్రీమతి కె బి లక్ష్మి గారు, శ్రీ గుడిపాటి గారు రాసారు. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం వెల నలభై రూపాయలే!

 

 

2004 లో మిత్రులు వడ్డి ఓం ప్రకాష్ నారాయణ, వేదాంతం శ్రీపతి శర్మ మరియు కస్తూరి మురళీకృష్ణ తో కలిసి
“4 x 5″  అనే కథా సంకలనం వెలువరించాను. ఈ పుస్తకం లో ఒక్కొక్కరం 5 కథలు అందించాం. కాబట్టి పుస్తకానికి 4 x 5 అనే పేరు పెట్టాము.

నా పుస్తకాలు విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవయుగ, నవోదయ వంటి అన్ని ప్రముఖ  పుస్తక కేంద్రాలలోను దొరుకుతాయి. 

 

పిల్లల కోసం The Adventures of Pinocchio అనే పేరుతో Carlo Collodi రాసిన చిన్న నవలని తెలుగులోకి అనువదించాను. “కీలుబొమ్మ సాహసాలు” అనే ఈ నవలను  హైదరాబాదుకు చెందిన పీకాక్ క్లాసిక్స్ వారు త్వరలో  ప్రచురిస్తున్నారు. 

నాన్‌ఫిక్షన్:
 ప్రస్తుతం EMESCO Publishers, హైదరాబాదు వారి కోసం “యోగ” పై ఒక పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను.   

శీర్షికలు:
1. నవంబర్ 2001 నుంచి ఆగష్టు 2003 వరకు ఆంధ్ర భూమి దినపత్రిక యొక్క సాధన అనే అనుబంధం లో - అంతర్జాతీయ అంశాలు
2. ఫిబ్రవరి 2001 నుంచి ఆగస్టు 2001 వరకు ఆంధ్ర భూమి దినపత్రిక యొక్క సాధన అనే అనుబంధం లో - Arithmetic. ఈ శీర్షిక లో పోటీ పరీక్షల కోసం లెక్కలు సులువుగా ఎలా చేయవచ్చో తెలిపాను.
3. జూలై 1999 నుంచి డిసెంబర్ 2000 వరకు ఆంధ్ర జ్యోతి దిన పత్రిక యొక్క కెరీర్ గైడ్ అనే పేజి లో - కరెంట్ అఫైర్స్
4. సెప్టెంబర్ 1998 నుంచి ఫిబ్రవరి 1999 వరకు Indian Express దిన పత్రిక యొక్క Career Express అనే పేజి లో - జనరల్ అవేర్ నెస్

 నన్ను somasankar@gmail.com అనే email లో సంప్రదించ వచ్చు.

7 Comments Add your own

  • 1. కందర్ప కృష్ణ మోహన్  |  జూన్ 12, 2007 at 12:29 అపరాహ్నం

    కొ.సో.శ గారూ,

    నాదీ మీ వయసే గానీ మీ శ్రమలో గానీ, పరిశ్రమలో గానీ పదిశాతం కూడా లేదు సుమా!
    అలా ముందుకెళ్తూండండి. మా ప్రోత్సాహం మీవంటి వారికే!

    కందర్ప కృష్ణ మోహన్
    భాగ్యనగరము

  • 2. మురళీకృష్ణ కూనపరెడ్డి  |  జూన్ 12, 2007 at 4:16 అపరాహ్నం

    బహు చక్కటి పరిచయం

  • 3. సిరిసిరిమువ్వ  |  జూన్ 13, 2007 at 4:58 పూర్వాహ్నం

    సుస్వాగతం. సాహితీప్రియులకి మంచి విందు అన్నమాట. మీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో కూడా చెపితే బాగుంటుంది, అలాగే టూకీగ వాటి పరిచయం కూడా, మీ వీలుని బట్టి.

  • 4. దుప్పల రవికుమార్  |  నవంబరు 23, 2007 at 4:22 పూర్వాహ్నం

    నమస్తే. వార్తలో మీ రచనలు చదువుతూ మీరు వయసులో చాలా పెద్దవారనుకున్నాను. కానీ చిన్న వయసులోనే మీరు ఎంతో సాహిత్య కృషి చేస్తున్నారు. అభినందనలు.

  • 5. srinivas  |  డిసెంబరు 20, 2007 at 12:28 అపరాహ్నం

    వ్యవసాయయం, వ్యవసాయ అనుబంద వ్యాపార రంగాలు, రైతులు, రైతుకూలీలు
    గ్రామీణపరిస్తితులు, వాటి మీద రాజికీయం యొక్క ప్రబావం, మొదలుగు అంశాలమీద రైతులుగా మా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలనుకొటునాము

    మా గురిచి క్లుప్తమ్గా, మేము సీనియర్ సిటిజన్స్, యంగ్ ఫార్మర్స్, నిరుద్యోగులు,రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి *వ్యవసాయం,చేపల చెరువులు,కూరగాయలసాగు,
    *పువ్వులతోటల సాగు మరియు శుభకార్యాలకు పువ్వుల అలంకరణ *రియల్ ఎస్టెట్ సంస్తలతో కలసి బంజరు బూములులో కలప,పండ్ల తొటలు, మొక్కల పేచుట,నిర్వహన,అభివ్పది,*గార్డెన్స్,ఫార్మ్ హోస్ నిర్వహన చెస్తునాము.

    రైతుల జీవన ప్రమానాల అభివ్రుది కై మీయొక్క సలహాలు, సూచనలు అభిప్రాయాలు దయచేసి తెలియజేయండి.

  • 6. k.v.rao  |  జనవరి 2, 2008 at 12:38 అపరాహ్నం

    mee gurinchi chadivi chala santhoshinchinanu .meeku purvajanma sukrutamu valla inta baga rachanalu cheyagalugu chunnaru.bhagavantuni asheeshulu meeku eppudu undalani koruchunnanu k.v.rao

  • 7. Krant hi  |  జులై 14, 2008 at 6:45 పూర్వాహ్నం

    కొల్లూరి సోమ శంకర్ garu,
    mee parichayam bagundi.mee lanti vaaru kuda ila blagulu rayadam naalanti variki ento spurthini isthundi.thanks for your support to us intensionally/unintensionally.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed