నేను బ్లాగడం మొదలుపెట్టి నిన్నటికి ఏడాది పూర్తయ్యింది. నేను బ్లాగు ప్రారంబించిన ఉద్దేశ్యం – నా సొంత కథలనీ, అనువాదాలని ఆన్ లైన్ పాఠకులతో పంచుకోవాలనే! ఈ ప్రయత్నంలో నేను సఫలమయ్యాననే చెప్పుకోవచ్చు. చాలా మంది నెటిజనులు నా కథలు చదువుతున్నారు, నచ్చితే మెచ్చుకుంటున్నారు. నచ్చకపొతే అదే మాటని సున్నితంగా చెబుతున్నారు. నన్ను నేను మెరుగుపరచుకోడానికి సూచనలూ చేస్తున్నారు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

అయితే law of diminishing marginal utility వర్తిస్తోందో లేక ఆఫీసు పని ఎక్కువ అవడం వల్లో, లేదా తరచూ ఊర్లు తిరగాల్సి రావడంతోనో, నాకీ మధ్య కొత్త టపాలేవీ రాయబుద్ధేయడం లేదు.

పైగా, ప్రస్తుతం ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం ఒక ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. దాంతో మారింత సమయాభావం కలుగుతోంది.   

నేను గత రెండేళ్ళనుంచి పత్రికలకి కథలు సబ్‌మిట్ చేసేడప్పుడు,  వాటిని శ్రీ-లిపి లో టైప్ చేస్తున్నాను. బ్లాగు మొదలు పెట్టక వాటిని యూనికోడ్ లోకి మార్చి నా బ్లాగులో పోస్ట్ చేస్తూన్నాను. అయితే టైప్ చేసిన కథలన్నీ అయిపోయాయి.  ఇంకా పాత కథలని పోస్ట్ చేయాలంటే వాటిని తిరిగి టైప్ చేయాల్సి రావడం ఇబ్బందిగా ఉంది. అందుకే కొత్త కథ పబ్లిష్ అయ్యేవరకు ఎదురు చూసి ఆ తర్వాత దాన్ని బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను. నా కథలు చదివేవారందరిని ఈ ఆలస్యాన్ని భరించాల్సిందిగా కోరుతున్నాను.  మీ ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తూ… సెలవా మరి?