ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్‌లో మానవ కల్పితమైన అనేక సమస్యలలో ఒకదాని చుట్టూ అల్లిన కథ ఇది. రోజూవారీ అవసరాలకి కావల్సిన అన్ని వస్తువులను మణిపూర్‌కి చేర్చాలంటే 39 నెంబరు నేషనల్ హైవే ద్వారానే రవాణా చేయాలి. ఈ కొండదారి తప్ప రవాణాకి మరో మార్గం లేదు. ఇంఫాల్ చేరాలంటే, ఘాట్‌రోడ్ మీదుగా నాగాలాండ్ గుండా ప్రయాణించాల్సుంటుంది. వ్యూహాత్మకమైన ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకున్న కొన్ని సంఘ విద్రోహక శక్తులు దారి కాచి వాహనాల నుంచి డబ్బులు గుంజుతుంటారు. ఇదేకాక, కొంత మంది స్వార్ధపరులు తమ గొంతెమ్మ కోర్కెల సాధన కోసం తరచూ ఈ ప్రాంతంలో రోజుల తరబడి రాస్తారోకోలు నిర్వహించి వేలాదిమందికి ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ప్రయాణీకుల, లారీ డ్రైవర్ల గోడు ఎవరికీ పట్టదు……. అటువంటి ఓ లారీ డ్రైవరు కుటుంబం కథే “ఎవరు ఏమైపోతే మాకేం”