‘అమ్మ వస్తే బాగుండు’ మూలకథని ఆంగ్లంలో వియాత్నాంకి చెందిన ప్రముఖ రచయిత్రి లి లాన్ రాసారు. ‘టెట్’ అనే పేరు గల ఈ కథని విల్మింగ్‌టన్‌బ్లూస్.కామ్ అనే వెబ్‌సైట్ ప్రచురించింది. ఈ కథ టెట్ పండగ నేపధ్యంలో సాగుతుంది. టెట్ వియాత్నాంలో పెద్ద పండగ. వారికి ఆ పర్వదినం నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండగ చాంద్రమానం ప్రకారం ప్రతీ ఏడాది 12 వ నెలలో 23 వరోజున ప్రారంభమై వారం రోజులపాటు కొనసాగుతుంది. ఉద్యోగాలు, సంపాదనల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ ఈ పండగ సందర్భంగా ఒక చోట కలిసి సంబరాలు చేసుకుంటారు. పిల్లలూ, పెద్దలు కలసి టపాసులు కాల్చుకుని దుష్ట శక్తులను తరిమివేస్తారు. ఈ పండగ సమయంలో పాత తప్పులను క్షమించి, పాత అప్పులను మాఫీచేసే సాంప్రదాయం వియాత్నాంలో ఉంది. ఎక్కువగా ఈ పండగని గ్రామీణ ప్రాంతాలలో జరుపుకుంటారు.

లి లాన్ హారీ పోటర్ నవలలని వియాత్నాం భాషలోకి అనువదించారు. ఆమె కథలను ఇంటర్‌నెట్‌లో చదవవచ్చు.