ఆదర్శాలు కలిగిఉన్నా, వాటిని పాటించలేక,అవినీతిపరులను ఎదుర్కోలేక, వాళ్ళకి లొంగిపోయే మనుషుల కథ ఇది. ఒక సారి ఆత్మ వంచన చేసుకోడం మొదలుపెడితే, తమతో పాటు మరో తరానికి కూడా అవినీతి జాడ్యాన్ని ఎలా అంటిస్తారో ఈ కథ చెబుతుంది.
మూల కథని ఆంగ్లంలో శ్రీ కార్తిక్ వెంకటేష్ రాసారు. మూల కథ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక The Hindu ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది.
డిసెంబర్ 2004 వరకు కార్పోరేట్ రంగంలో పనిచేసిన శ్రీ వెంకటేష్ గారు, ఆ తర్వత నుంచి, పంజాబ్ లోని భటిండా లో స్థిరపడ్డారు. అక్కడ ప్రస్తుతం ఓ బడిని స్థాపించి, దానికి ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు.
వీరు కథలే కాక కవితలు కూడా రాస్తూంటారు. వీరి రచనలు ఇంటర్ నెట్ లో లభ్యమవుతాయి.