అందరికీ నమస్కారం!
గత కొద్ది నెలలుగా నా బ్లాగు లో నేను రాస్తున్న సొంత కథలను, నా అనువాద కథలను చదువుతున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నేను ఈ బ్లాగులో 15 అనువాద కథలు, 7 సొంత కథలు పోస్ట్ చేసాను. మొదట్లో రెండు రోజులకొక కథ పొస్ట్ చేసేవాడిని. టపాల వేగం ఎక్కువవుతోందని కొందరు పాఠకులు సూచిండంతో ప్రస్తుతం వారానికో టపా రాస్తున్నాను.
పాఠకుల అభిప్రాయాలు తెలుసుకోడం రచయితకి చాలా అవసరమని నా భావన. మొదట్లో కామెంట్లు బాగానే వచ్చాయి. కానీ గత రెండు నెలలుగా నా బ్లాగు కి ఒకే ఒక కామెంటు వచ్చింది. నాకు నిరుత్సాహంగా ఉంది. నా కథలు మీకు నచ్చడం లేదేమోననిపిస్తోంది. నిజమేనా? నన్నేం చేయమంటారు?
సోమ శంకర్
అక్టోబర్ 17, 2007 at 3:33 అపరాహ్నం
మీ అభిప్రాయ సేకరణ బాగుంది.మీ కథల్లో వాస్తవాలు ఎక్కువ, కొంచం కల్పన జతచేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అంటే నిజం అక్కర్లేదా మీకు అనకండి. కాస్త ఆ రసం కూడా జోడిస్తే బాగుంటుందని, అంతే.
అక్టోబర్ 17, 2007 at 5:17 అపరాహ్నం
Don’t worry about the lack for comments. Pl. continue to write. You are doing a good job in translations and the original ones also are good.
అక్టోబర్ 18, 2007 at 2:34 పూర్వాహ్నం
కథలు పంచుకోడానికి బహుశా బ్లాగుల సరైన వేదిక కాదేమో.
ఒక సగటు బ్లాగుని అలవోకగా చదివేస్తాం. ఏమన్నా చెప్పాలనిపిస్తే ఓ రెండు ముక్కలు చెబుతాం వ్యాఖ్యలో. కథలకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ అలాంటీది కాదు. అందులో మీవి కొంచెం సీరియస్ కథలు కదా. మీరు వెబ్-జీన్లమీద దృష్టిపెడితే బెటారేమో, బ్లాగులో వెయ్యటం కంటే.
అక్టోబర్ 18, 2007 at 3:17 పూర్వాహ్నం
బ్లాగు భౌతికాంశాల ఆధారంగా కొన్ని సూచనలు..
1. మీ బ్లాగు హోమ్ పేజీకి వెళ్ళాననుకోండి.. దాదాపు పది జాబులు లోడవుతున్నాయి; కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోంది. ముందే ఒక్కో జాబూ పెద్దదిగా ఉంటుంది, పది జాబులు పేజీకెక్కాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతున్నది. వాటిని ఏ రెండుకో మూడుకో తగ్గించండి.
2. పెద్ద కథలను భాగాలుగా విడగొట్టి, జాబు పరిమాణాన్ని ఒక పరిమితిలో ఉంచండి. చదివేందుకు వీలుగా ఉంటుంది. అంతంత పెద్ద పెద్ద కథలను ఏకబిగిన – అందునా తెరమీద – చదవాలంటే కాస్త ఇబ్బందండి.
ఇక జాబు విషయానికి సంబంధించి..
1. గతంలో రాసిన కథలను తిరిగి ఇక్కడ పెడుతున్నారని అనుకుంటున్నాను. ఆ కథ రాసిన నేపథ్యం లాంటివి రాస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. (నాకు అసలు కంటే ఇలాంటి కొసర్ల మీదే ఆసక్తి ఎక్కువ లెండి)
2. అనువాదాలు చేస్తున్నారు గదా.. కథతో పాటు ఆ భాషలో ఆ రచయిత, ఆ రచనల కున్న విశిష్టతల గురించి కూడా కొద్దిగా రాయండి.
నా బ్లాగులో వ్యాఖ్యల డబ్బా లోడు కావడానికి ఏడుస్తోందని చదువరులు చెబితేనే నాకు తెలిసింది. ఇవీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను.
అక్టోబర్ 18, 2007 at 6:24 పూర్వాహ్నం
నేనూ మీలానే కథలూ, కాస్త కష్టతరమైన వ్యాసాలూ రాసే రచయితనే. కానీ, నా ప్రకారం పాఠకులు ఎప్పుడూ ఉంటారు. కాకుంటే, మామూలు పోస్ట్ ల కున్నంత సంఖ్యలో వుండకపోవచ్చు. కానీ, చదివినవారు ఒక్కరైనా కామెంట్ మీకు యివ్వకపోయినా మీరు వాళ్ల మనసులో ముద్రించుకుపోయి వుంటారు. గంగిగోవు పాలు గరిటెడైనను తరహాలో. . .ఆ ఒక్కరు చాలదూ మనకి? ఉదాహరణకి నా బ్లాగులో నేను జీనో పేరడాక్సులు-పూర్వపక్షం వ్యాసం నాలుగు టపాలుగా నాలుగు రోజులు రాసాను. రీడర్లు తక్కవే. కానీ, నాల్గవ భాగంలో ఒకే కామెంట్ వచ్చింది. మనసు, కడుపు అంతా నిండిపోయింది. వేసుకోండి వీరతాళ్లు అన్నాడు ఆ వ్యాఖ్యాత. కష్టం అంతా మర్చిపోజేసిన ఒకే ఒక్క వ్యాఖ్య. ఏమంటారు? ఆపవద్దు. కొనసాగించండి కథలు.
అక్టోబర్ 18, 2007 at 6:45 పూర్వాహ్నం
వికటకవి గారూ, మీ సూచనకి నెనర్లు. నా కథలలో కల్పన జోడింపుని మరింత మెరుగు పరుచుకోడానికి ప్రయత్నిస్తాను.
చిలకపాటి శ్రీనివాసు గారు, మీ వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు.
కొత్తపాళీ గారూ, మీ సూచన బాగుంది. వెబ్ జీన్లలో నా కథలు పొస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.
చదువరి గారూ, విపులంగా వివరించినందుకు కృతజ్ఞతలు. మీ సూచనల ప్రకరం నా బ్లాగులో కనిపించే టపాల సంఖ్యని కుదించాను. కథలని కూడా రెండు భాగాలుగ పొస్ట్ చేస్తాను. సొంత కథ రాసిన నేపథ్యం, అనువాద కథతో పాటు ఆ భాషలో ఆ రచయిత, ఆ రచనల కున్న విశిష్టతల గురించి కూడా కొద్దిగా రాస్తాను. మీ సూచనలు నాకు ఉపయోగపడతాయి.
అరుణ గారూ, మీ అభిప్రాయం తెలుసుకున్నాక సంతోషం కలిగింది.thank you
విజయ కుమార్ గారూ, మంచి టానిక్ లాంటి వ్యాఖ్య రాసి నాకు ప్రొత్సాహాన్న్నిచ్చారు. కృతజ్ఞతలు.
అక్టోబర్ 19, 2007 at 8:04 అపరాహ్నం
నిర్మొహమాటంగా చెపుతున్నాను సోమశంకర్ గారు – ఒకళ్ళ కామెంట్ల కోసం ఎప్పుడూ వేచి చూడవద్దు. చదివే రసజ్ఞ పాఠకులు ఎలాగూ చదువుతారు. చదివిన అందరూ కామెంట్లు రాయాలి అని లేదు కదా. అయినా మీ మనసుకి నచ్చింది, మీ హృదయం స్పందించి రాసింది ఎలాగూ పత్రికల్లో పడుతోంది కదా , అలాగే బ్లాగులో కూడ పడెయ్యండి. నిశ్శబ్ద నిశీధిలాగా ఉండే పాఠకుల ఆశీర్వాదాలు, అవి చాలా కొద్ది మందివే అయినా , ఆ ఆశీర్వాదాలే మనలని కాపాడుతూ ఉంటాయి…ఒకరి కామెంట్ల కోసం, మెప్పు కోసం రాయటం లేదు కదా మీరు, మీకు నచ్చింది, మీరు మెచ్చింది అలా అలవోకగా రాసేస్తున్నారు. ఆ సుగుణం, రచనా వైదుష్య కటాక్షం అందరికీ ఉండదు కదా – ఏదో కొద్ది మంది సరస్వతీ పుత్రులకి తప్ప.. ఇలా చెపుతున్నాను అని మటుకు ఏమీ అనుకోవద్దు అని మనవి, అది మీతో శతృత్వం తెచ్చిపెట్టినా సరే నేను చెప్పదలుచుకున్నది ఇది…ఒక వేళ మీరు నిజంగా కామెంట్ల కోసమే రాస్తున్నట్టు అయితే మటుకు కొంచెం దృక్పథం మార్చుకోవాల్సి రావచ్చు…
ఇవ్వాళ్ళ బాగుంది అన్న నోరే రేపు దరిద్రమయిన రాతలు అని అంటుంది…కాబట్టి వాటి కోసం వేచి చూడకండి
అక్టోబర్ 21, 2007 at 3:13 పూర్వాహ్నం
మాగంటి గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరన్నది నిజం. నేను కామెంట్లు ఆశించి రాయడం లేదు. నా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనప్పుడు, తర్వాత కొన్ని రోజులకి పాఠకుల లేఖల రూపంలో వారి అభిప్రాయాలు తెలుస్తాయి.
అయితే బ్లాగులో కథలు పొస్ట్ చేసినప్పుదు, కామెంట్లు రాకపోయేసరికి అసలు నా కథలు ఎవరైనా చదువుతున్నారా లేక నా సంతృప్తి కోసం నేనే బ్లాగుతున్నానా అని సందేహం కలిగింది.
మీ లాంటి వారి స్పందన చూసాక, నా సందేహం తొలగిపోయింది. మీ జాబుకి నా నెనర్లు.
మే 17, 2009 at 1:00 అపరాహ్నం
Cant I delete my previous comment here.
మే 18, 2009 at 3:58 పూర్వాహ్నం
Madam, I have deleted your previous comment on this post
Regards