నిజానికి నేను బ్లాగు మొదలు పెట్టింది నా కధలని, అనువాదాలని ఆన్ లైన్ లో ఉండే పాఠకులతో పంచుకోవాలనే.
కాని, బ్లాగులలోని మజా రుచి చూసాక, ఒక పట్టాన ఏదీ పొస్ట్ చేయకుండా ఉండలేక పోతున్నాను. అందుకని, ఏవేవొ రాయడం మొదలెట్టాను.
నా బ్లాగులో రోజుకో ‘టపా ‘ టక టకా వచ్చేస్తుంటే అన్నీ చదవడం కష్టమవుతోందని కొందరు మిత్రులు తెలిపారు. ఎంత రుచిగా ఉన్నప్పటికీ, కిలో పూతరేకులని ఒకేసారి తినలేము కదా అంటూ ‘ తెలుగు అబిమాని ‘ గారు సున్నితంగా హెచ్చరించారు. తరచి చూస్తే, నా బ్లాగులో టపాల వేగం ఎక్కువైందనే నాకూ అనిపించింది.
నాకు వెంటనే మనీ సినిమాలోని ఓ పాట గుర్తొచ్చింది. దాంట్లో బ్రహ్మానందం గారిని ఉద్దేశించి ‘జర జోరు తగ్గించు ఖాను ‘ అంటాడో అనుచరుడు. అది నాక్కూడా వర్తిస్తుందనిపించింది.
అందుకే కాస్త విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి వారానికో టపా పొస్ట్ చేస్తాను.
మళ్ళీ మన కలయిక వచ్చే వారం. అప్పటి దాక నా బ్లాగులోని కధలను చదవండి. మీ అబిప్రాయాలను తెలపండి.
సెలవా మరి!