ఇదొక మంచి కవిత. చదవండి.

 –––––––––––––––––––––––––

పూరింట్లో దీపం వెలిగితే
ఊరంతా కళకళలాడుతుంది
కృషీవలుల కడుపునిండితే
రుషీశ్వరుల తపసు పండుతుంది
గుడిసెలో పాప నవ్వితే
కోటిస్వర్గాలు ఆవిర్బవిస్తాయి
పళ్ళెటూళ్ళ్లు బాగుంటే
ప్రపంచమంతా బాగుంటుంది


కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తి