” అప్పుడు నేను అంతరిక్షం నుంచి కొద్దిగా తారాంతర ధూళిని, ప్రేమని, అభిమానాన్ని, అందాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత….” అంటూ కధకుడు చెప్పసాగాడు. ఇంతలో ఆయన ఒళ్ళో కూర్చుని ఉన్న పాపాయి అడ్డుపడింది. ” నువ్వు కధలో ముఖ్యమైన భాగాన్ని దాటవేస్తున్నావు..” అని అంది. ఆ వృద్ధ కధకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు. ఆయన ముఖంలో చిన్నపాటి దరహాసం కదలాడుతోంది. రూపంలో వృద్ధుడైనా, ఆయన వదనంలో పసిబాలుడి ఆకర్షణ ఉంది. ఆ పాపాయితో మాట్లాడుతుంటే ఆయన కళ్ళు మెరుస్తున్నాయి. ఆయన దేవుడు. ఆ పాపాయిని తను సృష్టించిన విధానాన్ని కధగా ఆమెకి చెబుతున్నాడు దేవుడు. ఆ కధని ఆమె ఎంతగా ఇష్టపడుతుందంటే, ఎన్ని సార్లు విన్నా, ఆమెకి విసుగనిపించదు. ” సరే, సరే! పొరపాటైపోయింది” అంటూ కధని కొనసాగించాడు దేవుడు. “ఆ తర్వాత, పై అరలో ఉన్న సీసాలోంచి కొంత ప్రేమని, నీలం సీసా లోంచి భావోద్వేగాలను, గులాబిరంగు సీసాలోంచి అందాన్ని తీసుకున్నాను. …” చెప్పాడు దేవుడు.  దేవుడి తెలట్లి గడ్డాన్ని సవరిస్తూ, ” అలమార సంగతి చెప్పు” అంటూ మారాం చేసింది పాపాయి.
” అప్పుడేమో నేను అలమారా అంతా బాగా వెదికి, ఓ అందమైన మానవ శరీరాన్ని బయటకు తీసాను. దానికి ప్రేమ, అభిమానం, అందం కలిపాను. అలా నువ్వు తయారయ్యావు” అని చెప్పి, ఆమె నుదుటిపైనచిన్న ముద్దు పెట్టాడు దేవుడు. దేవుడు చూపించిన ఆప్యాయతకి కరిగిపోయిందా పాప. దేవుడికి మరింతదగ్గరగా జరిగి నిద్రలోకి జారుకుంది. ఆమెని సృష్టంచక ముందు జరిగిన సంఘటనలలో, ఆమెకి చెప్పనివాటిని గుర్తు చేసుకున్నాడు దేవుడు. ” ఈ పాపాయి చాలా సున్నిశిత మనస్కురాలు. ఆ వివరాలన్నీ చెబితే, బాధ పడుతుంది” అని అనుకున్నాడు. ఆదాము, అవ్వలను – ఆ తర్వాత ఇంకెందరో మనుషులను సృష్టించిన దేవుడికి ఓ సంగతి స్పష్టమైంది. వాళ్ళను సృష్టించడంలో తాను పడే శ్రమకి ఈ మానవులు అర్హులు కారనిపించింది. తమని తాము నాశనం చేసుకోడంలో మానవులు ఆరితేరిపోయారు. ఒకరినొకరు చంపుకోసాగారు. మొదటగా కెయిన్, అబెల్ ను చంపడంతో మొదలైన హత్యాకాండ నేటికి కొనసాగుతూనే ఉంది. భగవంతుడి సృష్టి పట్ల, సాటి మనుషుల పట్ల మానవులకి గౌరవం లేకుండా పోయింది. కోపంతోను, రోత తోను, నిరాశతోను దేవుడు భూమి మీద సృష్టి కార్యాన్ని చిన్న దేవుళ్ళకి, చిల్లర దేవుళ్ళకి వదిలేసాడు. తాను శుక్ర గ్రహంపై దృష్టి సారించాడు. వాళ్ళు ఈ పనిని ఎంతో ఉత్సాహంగా స్వీకరించారు. కాని కొంత కాలం తర్వాత, వాళ్ళలో తొలినాటి ఆసక్తి లోపించింది. చాలా మంది చిన్నదేవుళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించసాగారు. చిల్లర దేవుళ్ళు వాళ్ళకి వంత పాడ సాగారు. సృష్టి చేసే గదంతా రకరకాల అలమారలతో నిండిపోయింది. ప్రేమ, దయ, కరుణ, ఉత్తమాభిరుచి వంటి ఉన్నత భావాలున్న సీసాలన్నీ పై సలలోకి చేరాయి. క్రింది వరువరుసలో మోసం, అసూయ, కామం వంటి భావాల పాత్రలను అమర్చారు. సృష్టి అనేది వారికి పరమ విసుగైన పనిలా తోచసాగింది. అయినప్పటికీ, వారంతా కష్టపడిపనిచేయసాగారు. పాపం! వాళ్ళ నడుములు నొప్పి పెట్టసాగాయి. భూమిపై ఓ మనిషిని సృష్టించాల్సినప్పుడల్లా, అలమారలలోని పై వరుసలని అందుకోలేకపోయేవారు. దాంతో, మనుషులని తమకి అందుబాటులో ఉన్న క్రింది సలోని పదార్దాలలో నింపేయసాగారు. ఎప్పుడో గాని పై వరువరుస జోలికి వెళ్ళడం లేదు. దీని ఫలితంగా, కొంత కాలానికి తమ అభిప్రాయమే సరైనదనే స్వార్ధపరుల సంఖ్య మంచి మనుషుల సంఖ్యని మించిపోయింది. పైగా అధికారం కూడ వాళ్ళ చేతుల్లోకే వెళ్ళిపోయింది. శుక్ర గ్రహంపైన ఏళ్ళ తరబడి సృష్టి చేసినదేవుడు విసిగిపోయాడు. మార్పు కోసం, భూమి మీద ఒక జీవిని సృష్టద్దామనుకున్నాడు. ఫలితమే ఈ పాపాయి! తన పూర్వీకుల లాగా మోసగాళ్ళు, నిర్దయా పరుల వలే కాకూడదని దేవుడు తనదైన పాత శైలిలో ఈమెని సృష్టించాడు. -
ఎంతో ప్రేమ, కరుణ, దయ, సత్ప్రవర్తనలను మిళితం చేసి ఈ పాపాయిని సృష్టించాడు. కాని అదే పెద్ద తప్పయిపోయింది. ఇటువంటి లక్షణాలున్న పాప, భూమి పై ప్రస్తుతం ఉన్న మనుషుల మధ్య  నెగ్గుకురాలేదు. తనపొరపాటుని గ్రహంచిన దేవుడు పాపాయిని భూమి మీదకుపంపడాన్ని వాయిదా వేసాడు. కాని అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరగాల్సిన ఘటనే.
” పాపాయికి విషయం చెప్పి, సిద్ధంగా ఉండమని చెప్పాలి. మరికొంత కాలం వాయిదా వేయగలిగితే బాగుండు” అని అనుకుంటు, ఆలోచనలలో మునిగిపోయాడు దేవుడు. కాసేపటికి పాపాయి నిద్ర లేచింది.

సముద్రపు నురగలలోంచి బయటకు వచ్చిన దేవకన్యలా, మేఘాల మధ్య నీలి రంగులో మెరిసిపోతున్న భూగోళం ఆమెని ఆకర్షించింది. భూగ్రహం కేసి చూపిస్తూ, ” నేను అక్కడికి వెళ్ళి ఆడుకోనా?” అని దేవుడిని అడిగింది. ” అక్కడికి వెళ్ళి ఆడుకుంటావా? దాన్ని ‘భూమి’ అంటారు.” చెప్పాడు దేవుడు వణుకుతున్న గొంతుతో. పాపాయి ఆనందంతో చప్పట్లు కొట్టింది.

” నేనక్కడికి వెళ్ళి ఆడుకోనా?అని అడుగుతూ, “మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చేస్తా” అని బ్రతిమాలసాగింది పాపాయి. తన కళ్ళలోని నిరాశని పాపాయి గమనించకుండా, దేవుడు తన దృష్టిని మళ్ళించాడు. ” అయతే నువ్వు భూమిమీద పుటాల్టమ్మా” అని చెప్పాడు. “పుట్టడమా? అంటే నేను నీ నుంచి దూరమవ్వాలా?” అంటూ సందేహం వ్యక్తం చేసింది పాపాయి. ” అవును” అంటూ గొణిగాడు దేవుడు.
” అయితే నేను వెళ్ళనే వెళ్ళను. నిన్ను వదిలిపోడం నాకిష్టం లేదు. నువ్వంటే నాకెంతో ఇష్టం” అంటూ పాపాయి దేవుడిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. దేవుడు ఆమెని ఓదార్చసాగాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాక, పాపాయి తన కళ్ళు తుడుచుకుంది. దేవుడు విచారంగా ఉండడం ఆమెకి నచ్చలేదు. పైగా ఆయన విచారానికి తను కారణమవడం పాపాయి భరించలేకపోయింది. దేవుడి మెడ చుట్టూ చేతులు వేసి, ” నాకు తోడుగా భూమి మీదకి ఓ నేస్తాన్ని పంపిస్తావా?” అని అడిగింది. ” నువ్వు ఏమడిగినా ఇస్తాను. నీకు స్నేహితుడిగా ఓ బాబుని పుట్టిసాన్తు. మీరిద్దరూ ఎల్లప్పుడూ కలసి ఉండేలా,మంచి తలిద్లండ్రులకి పిల్లలుగా మీరిద్దరు పుడతారు. నీకు చక్కని రూపం, అద్భుతమైన తెలివితేటలు లభిస్తాయి” అంటూ ముగించాడు దేవుడు.

* * *

నెలలు నిండిన భార్య నుదుటిపై ముద్దుపెటుక్టుంటూ, ” పుట్టబోయేది ఆడపిల్ల అయితే బాగుండు. నాకు ఆడపల్లలంటే చాలా ఇష్టం ” అని చెప్పాడు భర్త చిన్నగా నవ్వుతూ. ” పాపే పుడుతుంది లెండి” అని నవ్వు ముఖంతో చెప్పింది భార్య,బాధని ఓర్చుకుంటూ. ” ఈ సమయంలో నిన్ను విడిచివెళ్ళాలంటే బాధ ఉంది. కాని వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది. రెండు రోజులలో వచ్చేసాన్తుగా. పైగా అమ్మ వస్తోంది. నువ్వేం బెంగపడకు” అని చెప్పాడు ఓదార్పుగా. ‘అర్ధం  చేసుకున్నా’నన్నట్లుగా ఆమె భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆమె బాధ్యతను తన తలిక్లి అప్పగించి, అతడు వెళ్ళిపోయాడు.
కొన్ని గంటల పాటు ఆందోళనగా ఎదురుచూసాకా, ఆమె ప్రసవించింది. ఒకే కాన్పులో పాప, బాబు ఇద్దరూ జన్మించారు. అబ్బాయి చక్కగా
ఉన్నాడు. అన్ని సుగుణాలు ఆ చిన్నారిలో మూరీభ్తవించినట్లున్నాయి. అయితే పాప ఇంకా అందంగా, బంగారు వన్నెతో మెరిసిపోతోంది. పాప  కళ్ళు లేత నీలపు రంగు ఛాయలో ఉన్నాయి. స్ఫురద్రూపిగా కనిపిస్తోంది. ఆ పిల్లల తల్లికి ఇంకా స్పృహ  రాలేదు.
పిల్లలని చూడడానికి వచ్చిన వాళ్ళ నానమ్మ, ఒక్కసారిగా మ్రాన్పడిపోయింది. “అయ్యో, ఒకేకాన్పులో ఆడ పిల్లా, మగ పిలాడ్లు పుట్టడం అరిష్టం” అని అనుకుంది.
” ఇలా పుట్టిన పిల్లలు కుటుంబానికే శాపం! ఈ ప్రమాదాన్ని నివారించాలంటే, ఎవరో ఒకరే బ్రతకాలి”అని గొణుక్కుందావిడ. ఆమె ఆలోచనలు కొనసాగాయి. ‘ ఒకే బిడ్డ బ్రతకాలి. ఈ విషయాన్ని కొడుక్కి చెప్పాలి.  కాని వాడు నా మాట వినకపోతే? పైగా నావన్నీ వట్టి మూఢ నమ్మకాలంటూ కొట్టిపారేసాడ్తు. పిదప కాలం, పిదప బుద్ధులు….” అని తనలో తాను అనుకుంది. రెండు పిడికిళ్ళు బిగించుకుని, గదంతా ఆందోళనా పచార్లు చేయసాగింది.

 పిల్లలు మాత్రం ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళ నానమ్మ మనసు మాత్రంఅలజడిగా ఉంది. ” ఒక బిడ్డ చనిపోవాలి…” అని అంది ఓ గొంతు. ” కాని ఏ బిడ్డ?” అని అడిగింది మరో గొంతు. ” ఐతే, ఈ దారుణమైన పనిని ఎవరు చేస్తారు? నువ్వైతే చేయలేవు. పైగా నీ కొడుకు అడిగితే ఏం సమాధానం చెబుతావు?” అని ప్రశ్నించింది మూడో గొంతు.

ఉద్విగ్నతకి లోనైన ఆమె ఏం చేయాలో తోచక చేతుల్లో తల పటుక్టుని కూర్చుంది. కాసేపటికి ఓ నిర్ణయానికి వచ్చినదానిలా లేచి తన గదిలోకి వెళ్ళింది. తన ఇనప్పెట్టె తెరచి కొంత డబ్బుని బయటకు తీసింది. ఇప్పటి దాక ఆ డబ్బుతో తన కోడలికి ఏదైనా బహుమతి కొనాలనుకుంది. మంత్రసానిని రహస్యంగా పక్క గదిలోకి పిలిచి, డబ్బు అందించింది. ” ఒక బిడ్డసుకు పో! దాన్ని చంపేయ్! మాకు ఇద్దరు పిల్లలు వద్దు …” అని చెప్పింది లోగొంతుకతో.
” ఏ బిడ్డని?” అని అడిగింది మంత్రసాని. ” నీ ఇష్టంఏదో ఒక బిడ్డని తీసుకుపో.” అని అందామె చిన్నగా గొణుగుతూ. సమస్య తీరుతున్నందుకు ఆమె కళ్ళలో చిన్న మెరుపు కనిపించింది.

ఉయ్యాలలోకి తొంగి చూస్తూ, ” ఏ బిడ్డని?” అని మరో సారి అడిగింది మంత్రసాని. ఆమె పిల్లల కళ్ళ కేసి చూడడం లేదు. నేరుగా కళ్ళలోకి చూస్తే, తాను చెయ్యాల్సిన నీచమైన పనిని చేయలేనేమోనని ఆమె భయం! ఇంట్లో నలుగురిని పోషించాల్సిన దుస్ధితి ఆమెది. డబ్బెంతో అవసరం ఆమెకి.

” సాధారణంగా అందరూ ఆడపిల్లనే వద్దనుకుంటారు” అని అనుకుని, పాప వైపు కదిలింది. చాలా యాంత్రికంగా, పాప నోరు ముక్కు మూసేసింది. హఠాత్తుగా ఊపిరి ఆడకపోయేసరికి, పాపాయి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళలో తీవ్రమైన బాధ, ఎన్నో ప్రశ్నలు గోచరించాయి. ఏం జరుగుతోందో ఆమెకి అర్ధం కాలేదు. చావు అంటే గ్రహించేంత జీవితాన్ని ఆమెచూడలేదు కదా మరి!

* * *

జరిగిన సంఘటన దేవుడిని కలచివేసింది. మనుషుల మూర్ఖత్వానికి దేవుడు దిగ్భ్రమ చెందాడు. ఒక మాములు మగపిల్లాడి కోసం, అసాధారణమైన ఆడపిలన్లు వదులుకున్న అవివేకానికి దేవుడు సిగ్గుపడ్డాడు. పాపాయి మళ్ళీ దేవుడి దగ్గరకి వచ్చేసింది. కాని ఆమె నడకలో మునుపటి ఉల్లాసం లేదు. నిద్రలో నడుస్తున్నట్లుగా ఉంటోంది. ఇదివరకు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాడు దేవుడు. కాని ఘోరంగా విఫలమయ్యాడు. పాపాయి తన నివాసానికి వెళ్ళిపోయింది. దేవుడే ప్రతిరోజూ ఆమె దగ్గరికి వెళ్ళసాగాడు. పాపాయి ఎప్పుడు కిటికి దగ్గరే కూర్చుని, దూరంగా నీలంగా కనిపిసున్త్న భూగోళం కేసి చూసూంటుంది. దేవుడు వచ్చినా పట్టించుకోదు. దేవుడు తను ఆమెని సృష్టంచిన విధానాన్ని కధగా చెప్పబోతాడు.
పాపాయి మాత్రం జీవచ్ఛవంలా కూర్చుని వ◊నంగా ఉండిపోతుంది. కధలో ఆమె ఎక్కువగా ఇష్టపడే భాగాన్ని దాటేస్తాడు దేవుడు. కానిపాపాయి మాత్రం ఉలకదు, పలకదు.
అమరత్వం పొందినప్పటికీ, శాశ్వతమైన వ్యధకి  గురైంది పాపాయి.

ఆంగ్ల మూలం: రేషూ నాధ్

(ఈ కధ  జూన్ 2006 నాటి విపుల లో ప్రచురితమైంది)