ఇప్పటి మాట కాదులెండి. ఓ పది పన్నెండేళ్ళ క్రితం సంగతి. ఇంటర్ నెట్, ఈ మెయిల్ ఇప్పటిలా 

వ్యాప్తిలో లేని రోజుల సంగతన్న మాట. ఉత్తరాల కోసం,  పోస్ట్ మాన్ కోసం 

ఎంతగానో ఎదురుచూసేవాళ్ళం. అందులోను కాలేజిరోజులలో అయిదేళ్ళు 

హాస్టల్ లో ఉన్న నా  లాంటి వాళ్ళకి ఉత్త్రరాలు రాయడమూ, పొందడం ఎంతో

 ఆనందం కలిగించేది. ఉత్తరాల గురించి రాసిన కొటేషన్లు, కవితలు సేకరించడం

 నాకు హాబీగా ఉండేది.  ఉత్తరాల గురించి జయప్రభ గారు రాసిన ఈ కవిత

 నాకెంతో ఇష్టం

నీకు ఉత్తరం వ్రాయాలంటే
నాలో ఎంత సంతోషమో
నీ ఎదురుగా
నీతో నేను చెప్పలేని 
భావాలని
అక్షరాల హారాలుగా పంపిస్తాను
కాని
నీ ప్రతిస్వరం కోసం
నేను ఎదురుచూపులో
కూరుకుపోయినప్పుడు మాత్రం
నీకు ఉత్తరం వ్రాయడమంటే
నన్ను ఎంతగా బాధించే  విషయమో
నాకు తెలుస్తుంది
అయినా సంతోషాన్ని నీ ఉత్తరాలలో నింపుతూ
నీ మౌనంతో నేను 
బాధ పడుతుంటాను

జయ ప్రభ