ఒకప్పుడు
   మనసు కిటికీలోంచి వచ్చి
   వెన్నెలంతా గుండె గదిలో పరచుకునేది
ఇప్పుడు
   బాధ్యతల పరదాలు
   నెమ్మదిగా కిటికీలు తెరిచాక
   పరదా సందుల్లోంచి
అప్పుడప్పుడు
   ఓ వెన్నెల తునక మాత్రం
   లోపలికి జారిపడుతుంటుంది.

 - ధరణిప్రగడ రాధిక, (ఆంధ్ర ప్రభ వారపత్రిక 11-12-1991)

ఈ కవితని నేను ఎన్నిసార్లు చదివుంటానో, ఎంత మందికి quote చేసానో నాకే గుర్తులేదు.
రచయిత్రి వెన్నెల గురించి మాట్లాడినా, నేను దాన్ని సాహిత్యానికి అన్వయించుకున్నాను. ఎటువంటి బాధ్యతలు లేనప్పుడు (కాలేజి రోజులలో), ఎన్నెన్ని పుస్తకాలు చదివేవాళ్ళం? ఇప్పుడు బాధ్యతలు మీదపడ్డాకా, ఎన్ని పుస్తకాలు చదువుతున్నాం? రెండు వారాలకి ఒకటి.
మన పరిస్థితులకి అద్దం పట్టిన కవిత ఇది అందుకే నాకిష్టం.