ఈ ఏడాది కలకత్తా లో వానలు బాగా కురిసాయి. రోజులపాటు తెరిపిలేకుండా, ఒక్క నిమిషమైనా ఆగకుండా వర్షం కురుస్తునే ఉంది. గత కొద్ది రోజులుగా బన్సీ కి బేరాలు లేవు. రోడ్ల పైన అసలు మనుషులే లేరు. కుండపోతగా కురుస్తున్న ఈ వానలకి భయపడి ఎవరు ఇళ్ళలోంచి బయటకు రావడం లేదు. వాన కాస్త ఆగితేనే, బజారు ముఖం చూస్తున్నారు.
బన్సీ తన జీవితమంతా కలకత్తా లోనే గడిపేసాడు. తన చిన్నప్పటినుంచే రిక్షా లాగుతూ జీవనోపాధి కల్పించుకున్నాడు. దాదాపు యాభై ఏళ్ళ పాటు ప్రజల భరాన్ని తన భుజాల మీద మోసాడు. ఇక అతని ముసలి ఎముకలకి విశ్రాంతి కావాలి. మరిక, బన్సీ రిక్షా లాగడం మానుకుంటాడా? కాని అతను అలా అనుకోవడం లేదు.
తన ఏకైక కొడుకు పైనే బన్సీ ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడు. కొడుకుని మంచి బడికి పంపడానికి చాలా కష్టపడ్డాడు. తన కొడుకుకి మంచి చదువు చెప్పించేందుకు తనకి చేతనైనదంతా చేసాడు బన్సీ. ఎందుకంటే బన్సీ కి చదువుకునే అవకాశం చిన్నప్పుడు కలగలేదు మరి. తన కుటుంబ సభ్యుల అవసరాల కోసం, వారి ఆరోగ్యం కోసం బన్సీ రాత్రింబవళ్ళు కష్టపడుతూంటాడు.
“బన్సీ భాయ్! అలా వర్షం లో ఎందుకు తడుస్తావ్? ఇంటికి వెళ్ళిపోవచుగా?” అంటూ అరిచాడు దగ్గరలోని మందుల కొట్టు యజమాని నిర్మల్ బాబు.
“పర్వాలేదు, నిర్మల్ బాబు. నేను బాగానే ఉన్నాను. కొంచెంసేపాగి ఇంటికి వెళ్ళిపొతాను” బదులు చెప్పాడు బన్సీ.
బన్సీ వర్షంలో ఎందుకు తడుస్తున్నాడు? ఈ భారీ వానలో ఎవరు రిక్షా ఎక్కరు. మరి బన్సీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాదు?
***
బన్సీ కి తన కొడుకంటే ప్రాణం. రోజంతా శ్రమించి ఇంటికి వెళ్ళేడప్పుదు కొడుకు కోసం మిఠాయిలు, చాక్లెట్లు తీసుకెళ్ళేవాడు. తను చదువుకోనప్పటికి, తన కొడుకుని అతని చదువెలా సాగుతోందని తరచు అడిగి తెలుసుకునేవాడు. అతడి కొడుకు బడిలో పెట్టే అన్ని పరీక్షలలోను మంచి మార్కులు సాధిస్తున్నట్టు చెప్పేవాడు. కొడుకు మాటలకి ఊరట చెందిన బన్సీ, ఏదొ ఒక రోజున తన కొడుకు పెద్ద ఇంజనీరో, డాక్టరో అవుతాడని కలలు కనేవాడు.
మూడు నెలల క్రితం ఒక రోజు,బన్సీ కొడుకు తన ఒంట్లో బాగా నలతగ ఉందని చెప్పాడు. బన్సీ అతడిని దాక్టరు వద్దకి తీసుకెళ్ళడు. వైద్య పరీక్షలన్నీ అయ్యాయి.
“కాదు డాక్టరు గారు! మీరు చేప్పేది నిజం కాదు. మీరు ఖచ్చితంగా చెప్పగలరా?” ఆత్రుతగా అడిగాడు బన్సీ.
“నిజం బన్సీ, మీ వాడు మాదక ద్రవ్యలకి అలవాటు పడ్డడు” చెప్పారు దాక్టరు.
బన్సీ హతాశుడయ్యాదు.
* * *
ఈ రోజు పొద్దున్నే ఓ మాదకద్రవ్యాల పునరావాస కేంద్రం లో తన కొడుకుని చేర్చాడు బన్సీ.
మధ్యాహ్నం ఇంటికి వచ్చి త్వగా అన్నం తినేసి రిక్షా తీసుకుని బయటకు వచ్చడు. తర్వాత కొన్ని గంటలకే భోరున వర్షం కురవసాగింది. కాస్త కూడా తెరిపి ఇచ్చేడట్టు లేదు.
తనతో తెచ్చుకున్న పాత రైన్ కోటు వేసుకున్నడు బన్సీ. అప్పటినుంచి ఇలా వానలో తడుస్తునే ఉన్నడు. ఈ వర్షం లో ఎవరు రిక్షా ఎక్కరు. కబట్టి తను ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాని ఇంటికి వెళ్ళాలనిపించలేదు.
తన కొడుకు గురించే ఆలోచిస్తున్నాడు బన్సీ. “నేను ఎక్కడ తప్పు చెసాను? నా కొడుకు ఎందుకు తప్పుదోవ పట్టాడు ? దేవుడు లేడా? ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి?”
ఇలా రకరకల ఆలోచనలు బన్సీ మనసులో ముసురుకుని ఉండగ, బలమైన ఈదురుగాలులు తోడురాగా, ఆకాశంలో ఓ పెద్ద ఉరుము ఉరిమింది. బహుశా, ఇదే అననుకూల వాతావరణం ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుందనడానికి సూచనేమో ఆ ఉరుము……….
(మూల కధని ఆంగ్లంలో శ్రీ శుభజిత్ ఘోష్ Empty Nest అనే పేరుతో రాసారు)
సెప్టెంబరు 5, 2007 at 5:20 అపరాహ్నం
communists daridram thandavisthunttundi, bengallo, saraina jivanopaadi koraku athani timantha roadlamiide gadachi poyindi, karmani nammukovaalsi vchindi chivariki.